మాస్టర్ కలెక్షన్ల సునామీ: 200 కోట్ల క్లబ్‌లోకి

సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన విజయ్ తలపతి మాస్టర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు వసూలు చేస్తూ దూసుకెళ్తుంది. తాజాగా ఏకంగా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరుకుంది. ఒక్క తమిళనాడులోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేయగా.. మిగతా భాషల్లో కూడా భారీ కలెక్షన్లు సాధించింది. పాన్ ఇండియాగా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేశారు.

MASTER 200 CRORES CLUB

అన్ని భాషల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. రూ.200 కోట్ల క్లబ్‌లోకి విజయ్ సినిమా చేరుకోవడం ఇది వరుసగా నాలుగోసారి. విజయ్ నటించిన గత మూడు సినిమాలు బిగిల్, సర్కార్, మెర్సల్ సినిమా కూడా రూ.200 కోట్ల క్లబ్‌ను దాటాయి. బిగిల్ రూ.300 కోట్లను సాధించగా.. సర్కార్ రూ.250 కోట్లు, మెర్సల్ రూ.250 కోట్లు వసూలు చేశాయి. దీనిని బట్టి చూస్తే విజయ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.