ragini: కన్నడ చిత్రపరిశ్రమను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహరంపై నటి రాగిణి ద్వివేది ఇంట్లో శుక్రవారం సోదాలు జరిపి, ఆమెను తమ కార్యాలయానికి తీసుకెళ్లి.. అనంతరం ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆమె జైల్లోనే ఉండగా.. ఈ క్రమంలో నాలుగు నెలల జైలు జీవితం తర్వాత రాగిణికి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది సెప్టెంబర్లో నటీమణులు రాగిణి, సంజనా గిల్రానీని బెంగుళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో రాగిణి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా..
కర్ణాటక హైకోర్టు నిరాకరించింది. అనంతరం ragini ఆమె బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెలలోనే పిటిషన్పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విచారణలో నటి వాదనలు విన్న అనంతరం రాగిణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. అంతేకాదు, రాగిణి నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదని, ఇతర నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఆమెను అరెస్ట్ చేశారని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే ఈ విషయంపై ragini రాగిణి తరపున వాదించిన న్యాయవాది సిద్ధార్థ లూత్రా తెలుపుతూ.. తన క్లయింట్ నివాసంలో ఎలాంటి డ్రగ్స్ లేవని, కొంతమొత్తంలో పొగాకు మాత్రమే ఉందని కోర్టుకు తెలిపారు. ఒక నటి రాగిణి రేవ్ పార్టీల్లో, హోటళ్లు, ఫాంహౌస్ల్లో పార్టీలో ఏర్పాటు చేస్తూ డ్రగ్స్ సరఫరా చేస్తోందని నిజమైతే.. తన క్లయింట్ డ్రగ్స్ కలిగి ఉందనేందుకు ఆధారాలు చూపించాలని ragini రాగిణి తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదించారు. అన్యాయంగా ఆమెను 4నెలలు జైల్లో ఉంచారని కోర్టుకు తెలిపారు. దీంతో ఆ న్యాయవాది వాదనలను విన్నా సుప్రీంకోర్టు నటి రాగిణికి బెయిల్ మంజూరు చేసింది.