బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా రానున్న బెల్ బాటమ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌కి రూ.200 కోట్లకు మేకర్స్ అమ్మేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే సినిమా యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
మరికొంతమంది మాత్రం ఇది ఫేక్ న్యూస్ అని సోషల్ మీడియాలో కొట్టిపారేస్తున్నారు. ఓటీటీలో సినిమా రిలీజ్ చేయడానికి అక్షయ్ ఒప్పుకుంటాడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. లాక్డౌన్ వల్ల నష్టపోయిన థియేటర్ల యాజమాన్యాలు.. ఈ వార్తతో హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ క్రమంలో బెల్ బాటమ్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారనే వార్త బయటికి రావడం గమనార్హం.