బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పాన్ ఇండియా సినిమాపై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు దక్షిణాది ఇండస్ట్రీపై పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ సినిమాలు బాలీవుడ్ సినిమాలతో సమానంగా ఈజీగా 100కోట్ల బిజినెస్‌ను అందుకోవడం స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి వారి ఆలోచనలు మారాయి. ఇక దర్శక దిగ్గజ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం.
ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించడంతోపాటు.. పాన్ ఇండియా మూవీగా గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ నుండి సల్మాన్‌ఖాన్ దబాంగ్-3, అమిర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాలతో పాన్ ఇండియా మూవీగా ప్రయత్నం చేసినా.. కానీ సక్సెస్ కాలేదు. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్, తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సంఖి టైటిల్‌తో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని షారుఖ్ భావిస్తున్నాడట. గతేడాది నుంచి ఈ సినిమాపై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. కానీ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. ఇక సంఖి సినిమాతో తెలుగు, తమిళ్లో కూడా సక్సెస్ కొట్టాలని షారుఖ్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. షారుఖ్ నటించిన చివరి చిత్రం జీరో. కాగా నిజానికి జీరో పైనే షారుఖ్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఈ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో షారుఖ్ ఘోరంగా దెబ్బతిన్నాడు.