జపాన్‌లో విడుదల కానున్న మరో భారతీయ సినిమా

భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్ ఉంది. ఇండియాలో సూపర్ హిట్ అయిన చాలా సినిమాలు అక్కడ కూడా హిట్ అయ్యాయి. దీంతో భారతీయ సినిమాలకు జపాన్‌లో కూడా విడుదల చేస్తూ ఉంటారు. ప్రభాస్ హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా జపాన్‌లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దీంతో చాలామంది నిర్మాతలు తమ సినిమాలను జపాన్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

mission mangal JAPAN

తాజాగా మరో ఇండియన్ మూవీని జపాన్‌లో విడుదల చేస్తున్నారు. అక్షయ్ కుమార్, తాప్సీ, విద్యాబాలన, నిత్యమీనన్ నటించిన మిషన్ మంగళ్ సినిమాను జపాన్‌లో విడుదల చేసేందుకు సినిమా యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. ఇస్రో చేపట్టిన మంగళ్ యాన్ ప్రాజెక్టుకు దృశ్యరూపం అందిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండియాలో ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఫిబ్రవరి 8న జపాన్‌లో 40 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.