వివాదస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ కెరీర్లో విజయాల కంటే వివాదాలు, విమర్శలే ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసిందే. కాంట్రవర్సీ ఎక్కుడుందో అక్కడ వర్మ కూడా ఉంటాడు. ఈ నేపథ్యంలోనే రామ్‌గోపాల్‌వర్మకు సంబంధించి ఓ కొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. తన సినిమాలకు పనిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, వర్కర్లకు దాదాపు కోటి రూపాయల వరకు ఎగ్గొట్టాడని ఫెడరేషనన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్(F W I C E) ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇకపై ఆర్జీవితో పనిచేయకూడదని వాళ్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా కాలంలో చాలామంది పేద ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో పని చేయించుకుని వాళ్లకు డబ్బులివ్వకుండా తిరగడం వర్మకు మంచిది కాదని.. అలాంటి వాళ్లకు వెంటనే డబ్బులు చెల్లించాలని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారీ తెలిపారు. ఈ క్రమంలో డబ్బులు చెల్లించమని వర్మను కోరుతూ.. సెప్టెంబర్ 17నుంచి లేఖలు పంపుతూనే ఉన్నామని అన్నారు. ఇకపై తమ 32యూనియన్లలో ఒక్కరు కూడా పనిచేయరని ఆయన హెచ్చరించారు.