బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే అక్షయ్ ఒకవేళ కరోనా లేకపోయివుంటే.. తప్పకుండా ఆ నాలుగు సినిమాలు 2020లో విడుదలైవుండేవి. గతేడాది సూర్యవంశీలో నటించిన సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.. అయితే ఈ సినిమాను ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేటర్స్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఇదిలాఉంటే.. అక్షయ్ కొన్ని రోజుల క్రితమే బెల్‌బాటమ్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేయగా.. ఆ తర్వాత అంతరంగీరే అనే చిత్రీకరణలో పాల్గొన్నారు.
ఈ సినిమాలో తమిళస్టార్ హీరో ధనుష్ కూడా ఓ కీలకపాత్ర పోషించారు. అలాగే ఇప్పుడు బచ్చన్‌పాండే చిత్రీకరణ కోసం అక్షయ్ సెట్లో అడుగుపెట్టారు. అక్షయ్ గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది.. సాజిద్ నడియాడ్వాలా నిర్మాతగా.. ఫర్హాద్ సమ్జీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. నిర్మాత సాజిత్ నడియావాలాతో అక్షయ్‌కు ఇది 10వ సినిమా కాగా.. ఈ చిత్రంలో అక్షయ్ సరసన కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంకు సంబంధించిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అక్షయ్. నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. పాత కలయికలు.. బచ్చన్‌పాండే సినిమా షూటింగ్ మొదలైందని.. నా కొత్త లుక్‌పై మీ అభిప్రాయాలతో మీ శుభాకాంక్షలు తెలియజేయండని అక్షయ్‌కుమార్ ట్వీట్ చేశారు.