మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. అయితే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ప్రీరిలీజ్ ఈవెంట్ ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య జరిగింది. ఈ వేడుకకు హీరో రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు మిగతా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. డాన్‌శీను సినిమా ద్వారా రవితేజ తనకు సినిమా లైఫ్ ఇచ్చారని అన్నాడు.
ఆ సినిమాతో పాటు తర్వాత మా ఇద్దరి కాంబోలో వచ్చిన బలుపు సినిమా కూడా విజయవంతమైందని తెలిపాడు. ఇప్పుడు మూడోసారి క్రాక్ సినిమాతో బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ అవుతుందని గోపీచంద్ ధీమా వ్యక్తం చేశాడు. అలాగే ఈ సినిమా గురించి చెబుతూ.. క్రాక్ సినిమా నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిందని.. రవితేజతో పాటు ఈ సినిమాలో సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ చేసిన విలన్పాత్రలు ఇంకా మరికొన్ని క్యారెక్టర్ల్ నిజజీవితం ఆధారంగా తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్ నటిస్తోండగా.. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తున్నా