కొంతమంది హీరోలు, హీరోయిన్లు, నటులు తమ సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా సామాజిక బాధ్యతను కూడా చాటుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు స్వచ్చంధ సంస్థలు ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నారు. ఇటీవల లాక్డౌన్లో సోనూసూద్ నిర్వహించిన సామాజిక కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువత ముందుకొస్తుంది. ఇక తెలుగు హీరోయిన్ ప్రణీత ఎంతోమంది పేదవారికి లాక్డౌన్లో పండ్లు, కూరగయాలు పంచింది.
ఒక హీరోయిన్ గొప్ప మనస్సును చాటింది. ఆమె రవీనాటాండన్. ఆమె వయస్సు ఇప్పుడు 46 సంవత్సరాలు ఉంటుంది. కానీ 21వ సంవత్సరంలోనే ఆమె ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుని పెంచింది. అందులో ఒక అమ్మాయి పెళ్లి ఇటీవల జరగడంతో.. ఆమె దత్తత తీసుకున్న విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇలా పిల్లలను దత్తత తీసుకుంటే ఎవరూ పెళ్లి చేసుకోరని ఆమెను చాలామంది భయపెట్టారు. కానీ రవీనాటాండన్ అవి ఏమీ పట్టించుకోలేదు.
ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడానీని ఆమె పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. ఎన్నో సినిమాలతో టాప్ హీరోయిన్గా ఎదిగిన ఆమె క్రేజ్ ఇప్పటికీ ఏ మాత్రం తగ్గలేదు.