బన్నీకి చెల్లిగా నేచురల్ బ్యూటీ

గత ఏడాది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆ సినిమాలోని పాటలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవ్వగా.. సినిమా అయితే నాన్ బాహుబలి రికార్డులను బద్ధలుకొట్టి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సంపాదించింది. ఈ సినిమా హిట్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న అల్లు అర్జున్.. ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

sai pallavi sister role
sai pallavi sister role

పాన్ ఇండియాగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్‌గా హాట్ బ్యూటీ రష్మిక మందన్నా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా… జనవరి 8 నుంచి తిరిగి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఇది విడుదల అయ్యే అవకాశముంది.

అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. అదే ఏంటంటే… ఇందులో అల్లు అర్జున్‌కు చెల్లెలిగా నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించనుందనే వార్తలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఫిదా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సాయిపల్లవి.. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కథకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేస్తోంది. ఇప్పుడు కథ నచ్చడంతో బన్నీకి చెల్లిగా నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.