మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న ‘క్రాక్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమా U/A సర్టిఫికేట్ అందుకుంది. సినిమాలో వయోలెన్స్ కూడా ఎక్కువగానే ఉండటంతో ‘యు’కు తోడుగా ఏ కూడా ఇచ్చారు. క్రాక్ రన్ టైమ్ 154 నిమిషాలు ఉంది. అంటే 2 గంటల 34 నిమిషాలు ఉందన్నమాట. జనవరి 9న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.
ముందుగా ఈ సినిమాను జనవరి 14న విడుదల చేయాలని భావించారు. కానీ సంక్రాంతికి మాస్టర్, రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు విడుదల అవుతుండటంతో.. పండుగకు కొద్దిరోజుల ముందే క్రాక్ సినిమాను విడుదల చేస్తే లాభం ఉంటుందని దర్శక, నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమా కోసం రవితేజ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాను తెరకెక్కించగా.. ఇందులో రవితేజ పక్కన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజకు సరైన హిట్లు లేవు. దీంతో ఈ సినిమాపై రవితేజ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో రవితేజ పపర్పుల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.