ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ముచ్చటగా మూడో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో దీని షూటింగ్ జరుగుతోంది. ప్రగ్యా జైస్వాల్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది.
అయితే ఈ సినిమాలో ఒక పాత్రలో నటించాల్సిందిగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌ను సినిమా యూనిట్ సంప్రదించిందట. కానీ ఇందులో నటించేందుకు నిఖిల్ నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాత్ర కోసం బోయపాటి శ్రీను మరో హీరోను వెతుకున్నారని సమాచారం. ప్రస్తుతం నిఖిల్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. కార్తీకేయ 2 సినిమాతో పాటు 18 పేజీస్ సినిమాలో నటిస్తున్నాడు.
దీంతో బిజీ షెడ్యూల్స్ వల్ల బాలయ్య సినిమాలో నటించేందుకు నిఖిల్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. అంతకు తప్పితే దీనికి వేరే కారణం లేదని సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం బాలయ్య-బోయపాటి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను ముగించాలని బోయపాటి యోచిస్తున్నారు.