సింగిల్‌గా వెళ్లి సినిమా చూడాలంటే మినిమం రూ.150 అవ్వుతుంది. ఇక రూ.200, రూ.250 టికెట్లు కూడా ఉంటాయి. ఇక ఫ్రెండ్స్‌తో వెళ్లి ఎంజాయ్ చేస్తే చాలా అవుతాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే థియేటర్లను నడుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. థియేటర్లకు తీవ్ర నష్టం జరుగుతోంది. అసలే లాక్‌డౌన్‌తో థియేటర్ల యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడు 50 శాతం ఆక్యూపెన్సీతో నడపాలంటే పెద్దగా లాభం ఉండదని థియేటర్ల యాజమాన్యాలు చెబుతున్నాయి.
100 శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లను నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక థియేటర్ ఓనర్ ఏకంగా ఫ్రీగా సినిమా చూడవచ్చని ఆఫర్ ఇచ్చాడు. జనవరి 1 నుంచి ఇక జీవితాంతం థియేటర్‌కి వచ్చి ఫ్రీగా సినిమాలు చూడవచ్చని అంటున్నాడు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదట. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగులకు మాత్రమేనట. ప్రస్తుత ఉద్యోగులతో పాటు మాజీ ఉద్యోగులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందట.
పాట్నాలోని రీజెంట్ ఫన్ థియేటర్ ఓనర్ ఈ అవకాశం కల్పిస్తున్నాడు. దేశ సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులను గౌరవించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు థియేటర్ ఓనర్ సిన్హా చెప్పారు. ఆన్లైన్ ద్వారా లేదా బాక్సాఫీస్ వద్ద ఐడీ కార్డు చూపించి ఫ్రీగా టికెట్ పొందవచ్చన్నాడు.