రజనీ నిర్ణయంపై భారతీరాజా కీలక వ్యాఖ్యలు

రాజకీయాల్లోకి అడుగుపెట్టడం లేదంటూ సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన ప్రకటన కోలీవుడ్‌తో పాటు తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. రజనీ చేసిన ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అంటుండగా.. మరికొందరు మాత్రం పెదవి విరుస్తున్నారు. రజనీ నిర్ణయం ఆయన అభిమానుల్లాగే తనను కూడా షాక్‌కు గురిచేసిందని హీరో కమల్‌హాసన్ వ్యాఖ్యానించారు. ఆయన ఆరోగ్యం కూడా తనకు ముఖ్యమని, త్వరలోనే రజనీకి కలుస్తాననని చెప్పారు.

bharathiraja on rajani

ఈ క్రమంలో రాజకీయల నుంచి రజనీ వెనక్కి తగ్గడంపై ప్రముఖ తమిళ డైరెక్టర్ భారతీరాజా కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ నిర్ణయాన్ని తాను కూడా స్వాగతిస్తున్నానని, రాజకీయ ఊబిలోకి వెళ్లకపోవడమే మంచిదన్నారు. ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన జీవితాంతం ప్రశాంతంగా గడపాలన్నారు. రజనీ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు ఇంకెవరూ సంపాదించలేదన్నారు.

సినిమా నటులకు భాష, ప్రాంతాలతో సంబంధం లేదని, కానీ రాజకీయాలకు ప్రాంతీయుత తప్పకుండా కావాలని భారతీరాజా చెప్పారు. తమిళనాడులో తమిళులు మాత్రమే సీఎంగా ఉండాలని, ఆరోగ్యరీత్యా రజనీకాంత్ రాజకీయాలకు రాకపోవడమే మంచిదని భారతీరాజా వ్యాఖ్యానించడం గమనార్హం.