టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత త్వరలో వేక్డ్ ఔట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకోనున్న విషయం తెలిసిందే. ఆయనకు కూడా ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ పూర్తవ్వగా… ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కుటుంబ సభ్యులు, పిల్లల కోసం రెండో పెళ్లి చేసుకోనున్నట్లు సునీత కూడా సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. తల్లిదండ్రులు, పిల్లల భవిష్యత్ కోసం కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది.
దీంతో కంగ్రాట్స్ అంటూ సునీతకు అభిమానులు విష్ చేశారు. రామ్ వీరపనేనికి హీరో నితిన్ బాగా క్లోజ్. దీంతో ఇటీవల నితిన్ ఒక ప్రైవేట్ హోటల్లో కొత్త జంటకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రేణు దేశాయ్, సుమతో పాటు పలువురు సెలబ్రెటీలు దీనికి హాజరయ్యారు. అయితే సునీత-రామ్ల పెళ్లి డిసెంబర్లో ఉంటుందా?.. లేక జనవరిలో ఉంటుందా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ డిసెంబర్ 26న స్వయంగా సునీత, రామ్ కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ వద్ద రాత్రి 7:30 గంటలకు ఈ పార్టీ జరగనుంది. ఈ మేరకు ఒక ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పార్టీలో సునీత, రామ్లు కలిసి డ్యాన్స్ వేయనునున్నారట.