షూటింగ్ బ్రేక్‌లో ప్రముఖ నటుడు మృతి

ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు నటులు కరోనా వల్ల మృతి చెందగా.. మరికొంతమంది అనారోగ్యంతో మరణించారు. తాజాగా ఒక నటుడు సినిమా షూటింగ్ బ్రేక్ సమయంలో నీటిలో మునిగి మరణించాడు. ఆయనే మలయాళ నటుడు అనిల్ పి నేదుమంగాడ్. ఒక సినిమా షూటింగ్ కోసం ఇటీవల కేరళలోని తోడుపుళలోని మలంకరకు ఆయన వచ్చారు . సినిమా షూటింగ్‌ నుంచి కాస్త బ్రేక్ దొరకడంతో.. తన స్నేహితులతో కలిసి దగ్గరలోని ఒక అనకట్ట దగ్గరకు స్నానానికి వెళ్లాడు.

anil nedumangad death

ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఆయన మూతదేహాన్ని దగ్గరలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అనంతరం తోడుపుళ జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న సినిమా యూనిట్ తీవ్ర దిగ్భాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియం’ సినిమాలో కీలక పాత్రలో అనిల్ నటించాడు.

ఈ సినిమాలో తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు మలయాళ సినిమాల్లో నటించాడు. ఆయన ఇక లేరనే వార్త విని అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘పాపం చెయ్యతవర్ కెల్లెరియట్లే’ సినిమాలో చివరిగా ఆయన నటించారు. 2014లో సినిమా ఇండస్ట్రీలోకి ఆయన అడుగుపెట్టి.. ఇప్పటివరకు అనేక సినిమాల్లో నటించారు.