తెలుగులో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ‘వేదం’ సినిమాలో హీరోయిన్ అనుష్క వేశ్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఛాలెంజింగ్ పాత్రకు గాను అనుష్క నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఇలాంటి వేశ్య పాత్రనే ఒక బాలీవుడ్ నటి పోషించనుంది. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ హీరోయిన్ రాఖీ సావంత్. ఇక బాలీవుడ్లో ఇప్పటికే పలువురు వేశ్యగా నటించి మెప్పించారు. దేవదాస్‌లో మాధురీ దీక్షిత్, తవైఫ్లో రతి అగ్రిహోత్రి, ముఖద్దర్ కా సికిందర్లో రేఖా, ఉమ్రావ్ జాన్‌లో ఐశ్వర్యా రాయ్, పాకీజాలో మీనా కుమారి వేశ్యలుగా నటించి మెప్పించారు. ఇప్పుడు రాఖీ సావంత్ నటన ఎలా ఉంటుందనే దాని కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
వేశ్యల జీవితంపై తెరకెక్కతున్న ఒక వెబ్‌సిరీస్‌లో రాఖీ సావంత్ వేశ్యగా కనిపించనుందట. ఈ వెబ్‌సిరీస్‌లో వేశ్యల దీనస్థితితో పాటు సమాజంలో వాళ్లు పడుతున్న కష్టాల గురించి చూపించబోతున్నారు. ఇందులో రాఖీ సావంత్ పోషిస్తున్న వేశ్య పాత్ర ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు.
వేశ్య అన్న పదం వినగానే మనుషుల ముఖాల్లో హావభావాలు చిత్రవిచిత్రంగా ఎందుకు మారతాయో తనకు అర్ధం కాదని తాజాగా రాఖీ సావంత్ చెప్పింది. వాళ్ల దగ్గర నుంచి పన్ను వసూలు చేస్తున్నప్పుడు వాళ్లకు రక్షణగా ఉండేందుకు బలమైన చట్టాలను ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది వాళ్ల పిల్లలకు స్కూల్లో ఎందుకు అడ్మిషన్ దొరకడం లేదు? అని ప్రశ్నించింది. ఈ పదాన్ని ఈసడించుకునేవాళ్లు ఎంతోమంది. కానీ వారి జీవితాలు అంతకన్నా హీనంగా ఉంటాయని రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది.