స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరో రికార్డు నమోదైంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల అయిన ‘అల వైకుంఠపురములో’ సినిమా ఎన్నో రికార్డులను నమోదు చేసింది. తెలుగులో బాహుబలి తర్వాత అత్యధిక రికార్డులను నమోదు చేసిన సినిమాగా ఇది నిలవగా.. ఇక ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టించాయి. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్, లైక్స్ సంపాదించుకున్న తొలి సౌతిండియా పాటగా నిలిచింది. దీనిని బట్టి చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పాటలు ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యాయో అర్థమవుతోంది.
తాజాగా ఈ సినిమా మరో రికార్డు సృష్టించింది. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న సినిమాగా ఇది నిలిచింది. ఈ ఏడాదిలో సౌతిండియాలోనే అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సినిమాల స్థానంలో అల వైకుంఠపురములో సినిమా నెంబర్ స్థానంలో ఉందని స్వయంగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ప్రకటించింది. ఈ వార్తలో బన్నీ అభిమానుల ఆనందానికి అవుధులు లేవు. ఈ వార్తను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
థియేటర్లలో ఈ సినిమా భారీ కలెక్షన్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో కూడా అత్యధిక వ్యూస్‌ను సంపాదించుకోవడంతో అల వైకుంఠపురములో సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా ఈ సినిమా రాగా.. ఇందులో పూజా హెగ్దే హీరోయిన్గా నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కించగా.. తమన్ దీనికి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమా తర్వాత రెండో స్థానంలో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా రెండో స్థానంలో ఉంది.