రావణుడిలోని పాజిటివ్ కోణాన్ని ఆదిపురుష్ సినిమాలో చూపించబోతున్నట్లు ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ బయటపెట్టిన విషయం తెలిసిందే. రావణుడిలో కూడా మనావత్వం ఉందని, ఆయనలోని ఆ కొత్త కోణాన్ని డైరెక్టర్ చూపించనున్నాడని సైఫ్ అలీ ఖాన్ వెల్లడించారు. తన చెల్లికి జరిగిన అవమానానికి బదులుగా సీతను రావణుడు ఎత్తుకెళ్లడం కరెక్టే అనేలా రావణుడి పాత్ర ఉంటుందన్నాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. సైఫ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సైఫ్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువులకు బద్ధవ్యతిరేకి అయిన రావణుడిని ఎలా మంచిగా చూపిస్తారంటూ హిందుత్వ సంఘాలు మండిపడుతున్నాయి. ఆదిపురుష్లో రావణుడిని మంచివాడిగా చూపిస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నాయి. దీంతో తన వ్యాఖ్యలను సైఫ్ అలీఖాన్ వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలనైనా కించపరిచి ఉంటే క్షమించానలని కోరాడు.
తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, తనకు రాముడు అంటే ఎంతో గౌరవం ఉందని చెప్పాడు. ధర్మానికి ప్రతిరూపం రాముడు అని, ఆదిపురుష్ సినిమాలో చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూపించబోతున్నట్లు చెప్పాడు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆదిపురుష్ సినిమా విడుదల కానుండగా.. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను తెరెక్కిస్తుండగా.. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించున్నాడు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తీస్తున్నారు.