స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఇప్పటికే గీతా ఆర్ట్స్ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్‌లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ చాలా సినిమాలను నిర్మించారు. అందులో చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులందరికీ గీతా ఆర్ట్స్ దాదాపుగా సుపరిచితమే.
ఇక ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా యాప్‌ను అల్లు అరవింద్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మరో ఇద్దరి భాగస్వామ్యం ఉండగా.. అల్లు అరవింద్ మెయిన్ అని చెప్పవచ్చు. కొత్త సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లను ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో ఆహా యాప్ బాగా ఫేమస్ అయింది. అయితే త్వరలో అల్లు అరవింద్ మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టనున్నాడట.
ఇప్పుడు ఓటీటీలతో పాటు ఏటీటీలకు మంచి డిమాండ్ ఉంది. ఏటీటీ అంటే ఎనీ టైమ్ థియేటర్. ఏదైనా సినిమా చూడాలన్నా.. లేక.. వెబ్ సిరీస్ చూడాలన్నా సరే ఏటీటీలో ముందు టికెట్‌ను కోనుగోలు చేయాలి. ఓటీటీలో ఒకేసారి సంవత్సరం పాటు చందా కట్టి మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఏటీటీలో అప్పటికప్పుడు టికెట్ కొనుగోలు చేసి చూడవచ్చు.
ఇప్పటికే శ్రేయాస్ ఈటీ యాప్ ఉండగా.. ఇప్పుడు అల్లు అరవింత్ కొత్త ఏటీటీ యాప్‌ను తీసుకురానున్నారట. దీని వెనుక అల్లు అర్జున్ ఉన్నట్లు సమాచారం. అల్లు అరవింద్ ఫ్యామిలీకి అత్యంత నమ్మకస్తుడేన బన్నీ వాసుతో ఈ ఏటీటీ పెట్టించాలని అల్లు అరవింద్ ప్రయత్నాలు చేస్తున్నాడట