పొలిటికల్ ఎంట్రీపై రజనీ క్లారిటీ

సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఇవాళ చెన్నైలోని రాఘవేంద్ర మండపంలో అభిమాన సంఘాలతో రజనీకాంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అభిమాన సంఘాలతో రజనీకాంత్ మాట్లాడారు. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరారు. ఈ సమావేశం తర్వాత రజనీకాంత్ రాజకీయ అరగ్రేటంపై క్లారిటీ ఇస్తారని చాలామంది అనుకున్నారు.

rajanikanth

కానీ రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని రజనీకాంత్ చెప్పడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. రాజకీయాల్లోకి వస్తే మీ వెంటే ఉంటామని, బీజేపీకి మద్దతు ఇస్తే మాత్రం తాము ఒప్పుకోమంటూ అభిమానులు తేల్చి చెప్పారు. దీంతో ఈ సమావేశంలో రజనీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కాగా త్వరలో తమిళనాడు ఎన్నికలు జరగనున్న క్రమంలో రజనీకాంత్ రాజకీయ అరగ్రేటంపై ఆసక్తి నెలకొంది. ఆయన బీజేపీకి మద్దతిస్తారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. కానీ దీనిపై రజనీ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే రజనీ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. కానీ ఇప్పటివరకు రజనీ రాజకీయ పార్టీలపై ఎలాంటి ప్రకటన చేయలేదు