మీడియాపై దగ్గుబాటి రానా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు, ఓటీటీలపై నియంత్రణ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రానా స్పందించాడు సినిమాలు, ఓటీటీలపై కాదని, వార్తలపై నియంత్రణ ఉండాలని రానా సూచించాడు. మీడియాలో వచ్చే వార్తలకు సంబంధించి ఎలాంటి నియంత్రణ లేదని, ఏ న్యూస్ అవసరమో.. ఏది అనవసరమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని రానా తెలిపాడు. అలాగే RRR సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి బెదిరింపులను అందుకున్నాడు.
ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీంకు సంబంధించి విడుదలైన టీజర్ భారీ వ్యూస్‌ను సంపాదించుకుంది. అయితే ఈ టీజర్‌లో కోమురం భీంను ముస్లింగా చూపించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య సమరయోధుడు అయిన కొమురం భీంను ముస్లింగా చూపించి తప్పుగా చిత్రీకిస్తున్నారంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ సినిమాను థియేటర్లలో విడుదల కాకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఈ క్రమంలో రాజమౌళికి రానా అండగా నిలిచాడు. దేశంలో అనవసరమైన విషయాలను ఎక్కువగా పట్టించుకుంటున్నారని ఒక ఇంటర్వ్యూలో రానా వ్యాఖ్యానించాడు. ఇండియా పెద్ద దేశం అని, ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని రానా చెప్పాడు. పరిస్థితులు సాధారణం అయిన తర్వాత ఎవరి పనిలో వాళ్లు బిజీగా ఉంటారని రానా చెప్పాడు. కాగా జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. అలియా భట్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన రాంచరణ్, ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.