రాధేశ్యామ్ నుంచి యంగ్ హీరో ఔట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణకుమార్ తెరకెక్కిస్తున్న రాధేశ్యామ్ నుంచి ఒక యంగ్ హీరో వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సోదరుడి పాత్రలో తమిళ నటుడు అథర్వను ఎంపిక చేసినట్లు గతంలో సినిమా యూనిట్ తెలిపింది. కానీ లాక్‌డౌన్ వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్ల సినిమా నుంచి అతడు తప్పుకున్నట్లు సమాచారం.

radheshyam

దీంతో అతడి స్థానంలో మరో తమిళ నటుడైన జివి ప్రకాష్‌ను తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో విక్రమాధిత్య అనే పాత్రలో ప్రభాస్ నటించనుండగా.. పూజాహెగ్ధే ప్రేరణ అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడదులైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది. ఈ సినిను గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.

లాక్‌డౌన్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవ్వగా.. త్వరలోనే పూర్తి షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆదిపరుష్‌లో ప్రభాస్ నటించనున్న విషయం తెలిసిందే.