బిగ్‌బాస్‌లో విలన్ అతడేనట

గత బిగ్‌బాస్‌ల కంటే ఈ బిగ్‌బాస్ చాలా డిఫరెంట్‌గా జరుగుతోంది. నామినేషన్, ఎలిమినేషన్ల ప్రక్రియ అయితే హాట్ హాట్‌గా జరుగుతోంది. కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో చాలామంది బిగ్‌బాస్ చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 11 వారాలు ఈ షో పూర్తి చేసుకోగా.. ఈ వారం ఎలిమినేషన్లలో అవినాష్, మోనాల్, అరియానా, అఖిల్ ఉన్నారు. అయితే ఎవిక్షన్ పాస్ వల్ల అవినాష్ ఈ వారం సేవ్ అయ్యే అవకాశముంది.

bigboss4

దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే షో మరికొద్దిరోజుల్లో ముగియనున్న క్రమంలో బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారనే దానిపై చర్చ జరుగుతోంది. ఈ సారి అభిజిత్ విన్నర్ అవుతాడని మెజార్టీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో బిగ్‌బాస్‌లో విలన్ ఎవరు అని అభిజిత్ తల్లి లక్ష్మీని ప్రశ్నించగా.. అమ్మ రాజశేఖర్, అఖిల్ పేర్లను ఆమె చెప్పింది.

ప్రస్తుతం అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ కాగా.. అఖిల్ ఇంకా హౌస్‌లో కొనసాగుతున్నాడు. అభిజిత్‌కు హౌస్‌లో అఖిల్ గట్టి పోటీ ఇస్తున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న అఖిల్.. ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయి సీక్రెట్ రూంకి వెళ్లి మళ్లీ వచ్చాడు. అభిజిత్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు కనుకే అభిజిత్ తల్లి అఖిల్ పేరు చెప్పిందని సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు.