నిహారిక సీక్రెట్స్ బయటపెట్టిన నాగబాబు

వచ్చే నెలలో మెగా డాటర్ నిహారిక పెళ్లి పీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిహారిక గురించి ఆమె తండ్రి నాగబాబు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. ఒకవైపు బుల్లెతెరపై షోలు చేస్తున్న నాగబాబు.. సోషల్ మీడియాలో కూడా అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటాడు. ట్విట్టర్‌లో రాజకీయాలతో పాటు సినిమాలపై పోస్టులు పెడుతూ ఉంటాడు. అలాగే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు.

nagababu

అందులో భాగంగా తాజాగా తన కూతురు నిహారిక గురించి నాగబాబు పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. నిహారిక స్కూల్‌లో చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్‌తో కలిసి పది రోజులు ఉత్తరాంచల్ టూర్‌కు వెళ్లడానికి నన్ను పర్మిషన్ అడిగింది. కానీ టూర్‌కి వెళ్లడానికి నేను ఒప్పుకోలేదు. చివరికి నీ వెంట బాడీగార్డ్స్ పంపిస్తానని నిహారికకు చెప్పగా.. తన ఫ్రెండ్స్ చూసి నవ్వుకుంటారని చెప్పింది.

ఆ తర్వాత టీచర్లు, స్నేహితలు ఫోన్ నెంబర్లు ఇస్తూ నిహారిక నాకు ఒక లెటర్ రాసింది. ఎక్కడికి వెళ్లినా లోకేషన్ చెబుతూ రోజుకు కనీసం మూడుసార్లు ఫోన్ చేస్తానని, సిగ్నల్ లేకపోయినా ఎలాగైనా సమాచారం ఇస్తానని చెప్పింది. దీని వల్ల టూర్‌కు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని నాగబాబు చెప్పాడు. కేవలం నిహారిక సరిగ్గా కమ్యూనికేట్ చేయడం వల్ల ఇది సాధ్యమైందని, కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అని నాగబాబు చెప్పాడు.