ఇటీవల ‘సెహరి’ సినిమా ఫస్ట్ లుక్ను నందమూరి నటసింహం బాలకృష్ణ రిలీజ్ చేశాడు. ఈ సమయంలో అప్కమింగ్ యంగ్ హీరో హర్ష చేయిపై బాలయ్య కొట్టడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో దీనిపై తాజాగా హీరో హర్ష స్పందించాడు. బాలకృష్ణ తనను చేతిపై కొట్టిన మాట వాస్తవమేనని, కానీ కావాలని ఆయన కొట్టలేదన్నాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసే సమయంలో తాను పోస్టర్ను ఎడమ చేతితో పట్టుకున్నానని, అలా ఎడమ చేతితో పట్టుకోకూడదని బాలయ్య చెప్పాడని హర్ష చెప్పాడు. కుడి చేతితో మాత్రమే పట్టుకోవాలని చెబుతూ బాలయ్య తనను చేతిపై కొట్టాడని హీరో హర్ష చెప్పాడు. అంతేకానీ బాలయ్య తనను నిజంగా కొట్టలేదన్నాడు.
మాములుగా బాలయ్యకు దైవభక్తి ఎక్కువనే విషయం మనందరికీ తెలిసిందే. ఆచారాలు, సాంప్రదాయాలు బాలయ్య బాగా పాటిస్తాడు. ఎడమ చేతితో తాకితే అశుభం అని భావించి హీరో హర్ష చేతిని తాకాడని, అంతకు తప్పితే కావాలనే బాలయ్య అలా కొట్టలేదని సెహరి సినిమా యూనిట్ చెబుతోంది