సినిమాలకు పవన్ బ్రేక్?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలపై దృష్టి పెట్టాడు. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగా.. త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, అభ్యర్థులను బరిలోకి దింపుతామని పవన్ ఇప్పటికే ప్రకటించాడు. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అర్థమవుతోంది.

ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసే అవకాశముంది. ఇదే జరిగితే పవన్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా షూటింగ్‌లు ఆగిపోనున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తుండగా.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొన్నారు. త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎన్నికల ప్రచారంలో పవన్ పాల్గొంటే ఈ షూటింగ్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశముంది.

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఉన్నందున సినిమా షూటింగ్‌లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని పవన్ యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు పూర్తైన తర్వాత మళ్లీ షూటింగ్‌లలో పవన్ పాల్గొనే అవకాశముంది.