నల్లటి అమ్మాయిలనే ఇష్టపడతారు.. నటి షాకింగ్ కామెంట్స్

25 ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అలనాటి నటి అర్చన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. ఒక మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘ఒక నల్లని అమ్మాయి కనుక స్క్రీన్ ముందుకొస్తే కెమెరా మెన్లకు లడ్డులు తింటున్నట్టు ఉంటుంది. అంత ఇష్టపడతారు. మంచి నటీమణులను చూస్తే వారంతా దాదాపు నల్లగా ఉన్న మహిళలే’ అంటూ అర్చన సంచలన వ్యాఖ్యలు చేసింది.

archana

కొత్త అమ్మాయి సినిమాకు పనికిరాదనే కారణం వల్ల కొన్ని సినిమా ఆఫర్స్ తనకు రాలేదని అర్చన చెప్పింది. సీరియస్ సినిమాల్లో నటించడం తెలికేనని, కానీ కామెడీ రోల్స్ చేయడమే కష్టమని ఆమె చెప్పారు. కామెడీ చేయాలంటే టైమింగ్ ఉండాలని చెప్పింది.

1980లలో పలు విజయవంతమైన సినిమాల్లో నటించింది అర్చన.. 1988, 89 సంవత్సరాల్లో వరుసగా జాతీయ ఉత్తమ నటి అవార్డులు ఆమె గెలుచుకుంది.