తన జీవిత కథను ప్రముఖ నటుడు సోనూసూద్ పూస్తక రూపంలో తీసుకురానున్నాడు. స్వయంగా అతడే తన ఆటోబయోగ్రఫీని రాయనున్నాడు. దీనికి ‘I Am No Messiah’ అని టైటిల్ కూడా పెట్టాడు. దీనికి ‘నేను మహానుభావుడిని కాదు’ అనే అర్థం వస్తుంది. లాక్‌డౌన్‌లో ఎంతోమంది వలస కార్మికులకు భోజనం పెట్టి విమానాలు, బస్సులు, ట్రైన్లలో సొంతూళ్లకు సోనూసూద్ పంపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆపదలో ఉన్న ఎంతోమందికి సోనూసూద్ ఆపన్నహస్తం అందించాడు.
ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు విద్యార్థులకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు అందించాడు. ఇక చిత్తూరు జిల్లాకు చెందిన దళిత రైతుకు ట్రాక్టర్, వరంగల్ అమ్మాయికి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పించడం లాంటివి ఎన్నో చేశాడు. దీంతో సోనూసూద్‌ను ఎంతోమంది దేవుడితో పోలుస్తున్నారు.
ఈ అనుభవాలను పూస్తక రూపంలో సోనూసూద్ తీసుకురానున్నాడు. డిసెంబర్‌లో ఆ పుస్తకాన్ని విడుదల చేయనున్నాడు. ‘నేను మహానుభావుడిని కానని నేను బలంగా నమ్ముతాను. నా మనసు ఏం చెప్పిందో అదే నేను చేశాను. ఒకరికొకరు తోడుగా ఉండటం, ఒకరికొకరు సాయం చేసుకోవడం అనేది మనషులుగా మన బాధ్యత’ అని సోనూసూద్ చెబుతున్నాడు.