విజయ్ అభిమానులకు దీపావళి కానుక రెడీ

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘మాస్టర్’ సినిమాకు సంబంధించిన టీజర్ దీపావళి కానుకగా రేపు విడుదల కానుంది. రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. ఇది హీరో విజయ్ 65వ సినిమా. ఇందులో విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు.

VIJAY DALAPATHI MASTER

కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడగా.. వచ్చే ఏప్రిల్ నాటికి ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు కసరత్తు చేస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపిస్తాడని తెలస్తోంది. కాలేజీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.

మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.