“తోలుబొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం GST (GOD, SAITHAN, TECHNOLOGY). ఈ చిత్రం కాన్సెప్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ – తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్ పై జానకిరామ్ నిర్మిస్తున్న మూవీ GST అనగానే ఇప్పుడున్న GST ట్యాక్స్ పై గవర్నమెంట్ పై పోరాటం చేస్తాడేమోనని అనుకున్నాను. కానీ.. ఈ GST అంటే GOD, SAITHAN, TECHNOLOGY అని తెలియగానే చాలా కొత్తగా వుందనిపించింది.
ఈ సమాజంలో దేవుళ్లని నమ్మే వాళ్లున్నారు , దెయ్యానికి బయపడే వాళ్లున్నారు, అలాగే సైన్స్‌ని నమ్మేవాళ్లున్నారు. దేవుడు, దెయ్యం, సైన్స్.. ఈ మూడింటిపై పొరాటం అని తెలియగానే చాలా మంచి కాన్సెప్ట్ అనిపించింది. ఇలాంటి కొత్త పాయింట్ తో కొత్త కొత్త టెక్నాలజీలతో వచ్చే కొత్త దర్శకులు చిత్ర పరిశ్రమకు ఎంతో అవసరమని, పోసాని గారి దగ్గర చేసిన శిష్యులు మంచి విజయాలు సాధించారు కాబట్టి, జానకిరామ్ కూడా మంచి దర్శకుడిగా ఎదగాలని ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్‌కి అభినందనలు
అన్నారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ – ఈ విశ్వం మొత్తం దేవుడు, దెయ్యం, సైన్స్ చుట్టూ తిరుగుతుంది. అందుకే కొందరికి దేవుడిపై సందేహాలున్నాయి, ఇంకొందరికి సైన్స్‌పై సందేహాలున్నాయి. మరి కొందరికీ దెయ్యాలపై సందేహాలున్నాయి . ఇలాంటి సందేహాల నుంచే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని, దాన్ని బలమైన కథగా మలచి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. దేవుడు, దెయ్యం, సైన్స్.. ఇందులో ఏది నిజం , ఏది అబద్దం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నసమస్య కాబట్టి ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా లవ్, కామెడీ, హారర్, సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు మంచి సందేశాన్ని ఇస్తున్న కమర్షియల్ చిత్రం. మా చిత్రం యొక్క కాన్సెప్ట్ లుక్ పోస్టర్ని తమ్మారెడ్డి భరద్వాజగారు లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తూ, వారికి ప్రత్యేక ధన్యవాదాలు“ అన్నారు.
అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని త్వరలో మీముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హీరోలు: ఆనంద్ కృష్ణ, అశోక్, హీరోయిన్స్ స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజా సుహాసిని, వాణి, శ్రష్టి వర్మ, కామెడి పాత్రలో జూ. సంపు, ఇతర తారాగణం: వెంకట్, నందు, స్వప్న, వేదం నాగయ్య, గోవింద్, నల్లి సుదర్శనరావు, జానపదం అశోక్
ఎడిటింగ్: సునీల్ మహారాణ
D.O.P: డి. యాదగిరి
సంగీతం : U.V. నిరంజన్,
నిర్మాత: కొమారి జానయ్యనాయుడు,
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : కొమారి జానకి రామ్,
PRO: మధు వి. ఆర్