సమంత తమిళనాడు నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయినా ఆమె అచ్చం తెలుగింటి అమ్మాయిలాగే ఉంటుంది. మోడ్రన్ డ్రెస్ వేసినా.. శారీ కట్టుకున్నా సరే సమంత చూడముచ్చటగా ఉంటుంది. సమంత శారీస్ కట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంది. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా చేనేత వస్త్రాలకు ఆమె బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుందంటే.. వస్త్రాలపై ఆమెకు ఉన్న ఆసక్తి ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తాజాగా ఒక మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌లో స్వయంగా తాను తయారుచేసిన ఒక చీరను సమంత ధరించింది. ఈ ఫొటోషూట్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిని చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. తెల్లని రంగులో వదులుగా ఉండే సగం చేతుల జాకెట్టుతో ఈ చీరను సమంత స్టైల్ చేసింది. లిష్ జాకెట్టు ప్రకాశవంతమైన పింక్ పైపింగ్ కలిగి ఉంది.
ఇటీవల దసరా సందర్భంగా బిగ్‌బాస్4 ఏపిసోడ్ హోస్ట్ చేసినప్పుడు రెడ్ శారీలో సమంత వచ్చిన విషయం తెలిసిందే. ఆ శారీ గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.