టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఏంటో అందరికి తెలుసు. అతను ఎలాంటి వ్యక్తి అంటే డార్లింగ్ అని ఎవరిని అడిగినా చెబుతారు. అంతగా అందరికి మంచి మనసుతో దగ్గరైన ప్రభాస్ గురించి ఇటీవల సీనియర్ నటి భాగ్య శ్రీ కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఆమె ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇక షూటింగ్ స్పాట్ లో చిత్ర యూనిట్ మొత్తం కూడా తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు.
ఎన్నో వంటకాల రుచి చూపించిన ప్రభాస్ షూటింగ్ ముగిసిన తరువాత ఒకసారి కొన్ని స్వీట్ బాక్స్ లు కూడా బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. అయితే చిన్న వయసులో ప్రభాస్ తనపై చాలా క్రష్ పెంచుకొన్నట్లు చెప్పాడని భాగ్య శ్రీ వివరణ ఇచ్చారు. ఇక సినిమాలో ప్రస్తుతం మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నానని అన్నారు. అయితే ప్రభాస్ తల్లి పాత్రకు నువ్వు సరిపోతావా అని నన్ను చాలా మంది అడిగారు. ఆ విషయం దర్శకుడు రాధాకృష్ణని అడిగితే అతను మీరు మీలా నటిస్తే చాలని అన్నాడు.. అని భాగ్య శ్రీ వివరణ ఇచ్చారు.