పూజా హెగ్డే, అఖిల్ అక్కినేని నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రానికి సంబంధించిన టీజర్ ఆదివారం విడుదలైంది. టీజర్‌ను షేర్ చేసుకుంటూ అఖిల్ ఇలా వ్రాశాడు, “హర్షకు అర్హత ఉందా లేదా? చాలా సరదాగా మీ ముందుకు త్వరలో వస్తాడు. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు..” అని పేర్కొన్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ GA2 పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత భాస్కర్ తెలుగు సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అఖిల్ యునైటెడ్ స్టేట్ లోని ఒక ఎన్ఆర్ఐ పాత్రను పోషిస్తున్నాడు. పూజా స్టాండ్-అప్ కమెడియన్ స్కిల్స్ తి కనిపిస్తోంది. టీజర్ ని చూస్తుంటే అఖిల్ ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. అసలైతే ఈ సినిమా మేలో విడుదల కావాల్సింది, కాని కొనసాగుతున్న కరోనావైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా మిగిలిన షెడ్యూల్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు మరియు వచ్చే ఏడాది ప్రారంభంలో దీన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు.