తిరుమలలో గరుడోత్సవం సందర్బంగా కళాకారులతో కోలాటం ఆడిన నందమూరి ఫ్యామిలీ

తిరుమలలో ప్రతినెలా శ్రీవారి మహోత్సవం తరువాత గరుడోత్సవం ఘనంగా జరుగుతుంటుంది. ఈసారి కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన కృష్ణ, నందమూరి సీమ, నందమూరి రూప, నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. గరుడ వాహనానికి హారతి పట్టిన తరువాత అక్కడ ఉన్న కళాకారులతో కోలాటం ఆడి, స్థానికులను మెప్పించారు. అనంతరం అక్కడ స్థానిక హోటల్ లో ఎన్టీఆర్ రాజు, శ్రీధర్ వర్మ, ఇంకా సాధారణ ప్రజలతో కలిసి టిఫిన్ చేశారు.

గతంలో కూడా నందమూరి మోహన కృష్ణ గారు అన్నదాన ట్రస్ట్ కి విరాళాలు అందించారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.తమకు తిరుమలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్థానికులతో, కళాకారులతో ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఎంతో సంతోషం, సంతృప్తినిచ్చిందని నందమూరి రూప అన్నారు. 

Related Articles

Latest Articles