‘హుషారు 2’ టీజ‌ర్‌ విడుదల – కీలకపాత్రలో పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణ‌మూర్తి

‘‘ప్రతీ గడపకు ఓ క‌థ ఉంటుందంటారు..కానీ ఈ చిత్ర‌గుంజ్‌లో ప్ర‌తీ గ‌డ‌ప‌కు ఒకే క‌థ‌… అంద‌రి ఇంటి పేరు ఒక్క‌టే భ‌యం. ఒక వైపు ర‌క్తంతో రాజ్యాన్ని ప‌రిపాలించే రాక్ష‌సుడు..మ‌రోవైపు అడ‌విలో క్రూరంగా వేటాడే సాయుధులు వీళ్ల మ‌ధ్య‌లో న‌లిగి పోతున్న ప్ర‌జ‌లు ఒక నాయ‌కుడి కోసం ఎదురు చూస్తున్నారు.. ఎవ‌రా నాయ‌కుడు’’ అనే ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో ‘హుషారు 2’ టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది.

ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన హుషారుకు సీక్వెల్ ఇంత యాక్ష‌న్ మోడ్‌లో రాబోతుందా! అనే డౌట్ అంద‌రి వ‌చ్చేసే లోపు.. రాహుల్ రామ‌కృష్ణ ‘అరే చంద్ర‌మోహ‌న్ ఆపు.. నీ స్టోరీకి, ఎమోష‌న్స్‌కి ఏమైనా సంబంధం ఉందా టోట‌ల్ డిస్‌క‌నెక్ట్?’ అని గ‌ట్టిగా అర‌వ‌టంతో మొత్తం సీన్ మారిపోయింది.

బాయ్స్ ఆర్ బ్యాక్ అనే క్యాప్ష‌న్‌తో సినిమా షూటింగ్ లొకేష‌న్‌లో సీన్ మొద‌ల‌వుతుంది. అడ‌విలో అరుపులు అనే సినిమాను చేస్తున్న‌ట్లు చూపించారు. రాహుల్ రామ‌కృష్ణ త‌న న‌లుగురు బాయ్స్‌తో క‌లిసి ఓ క్రేజీ ఐడియాను నిజం చేసుకోవ‌టం కోసం చిత్ర‌గుంజ్‌కు చేరుకుంటాడు. అక్క‌డ నుంచి క‌థ ఎన్నో మ‌లుపులు తిరుగుతుంది. ఓ వైపు విల‌న్స్‌.. మ‌న క్రేజీ కుర్రాళ్ల గ్యాంగ్‌ను చంప‌టానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. వీళ్లేమో త‌ప్పించుకుని పారిపోతుంటారు. చివ‌ర‌కు వాళ్లు న‌క్స‌లైట్స్ చేతికి చిక్కుతారు. అక్క‌డ న‌క్స‌ల్స్ నాయ‌కుడు పాత్ర‌లో పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి పాత్ర‌ను ప‌రిచ‌యం చేశారు.

‘త‌మ్ముళ్లు వేట మొద‌లెడ‌దామా!’ అనే ఆయ‌న ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్‌తో టీజ‌ర్ ముగిసింది.

టీజ‌ర్ చూస్తుంటే హుషారు 2లో కావాల్సినంత ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, యాక్ష‌న్ పార్ట్ కూడా ఉండ‌బోతుంద‌నేది తెలుస్తుంది. ఇంత‌కీ విల‌న్స్ మ‌న హీరో బ్యాచ్‌ను ఎందుకు చంపాల‌నుకుంటారు? అనే విష‌యం తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందేనంటున్నారు మేక‌ర్స్‌.

2018లో విడుదలై యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ‘హుషారు’ చిత్రం ఎంత‌టి ఘన విజయాన్ని అందుకుందో మ‌నంద‌రికీ తెలుసు. తాజాగా ద‌ర్శ‌కుడు శ్రీహ‌ర్ష ఈ క్రేజీ మూవీకి సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. రెట్టింపు ఫన్, మ్యాడ్‌నెస్, నాన్‌స్టాప్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘హుషారు 2’ మ‌న ముందుకు రానుందీ చిత్రం.

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమాను రిలీజ్ చేయ‌టానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

న‌టీన‌టులు:

రాహుల్ రామ‌కృష్ణ‌, అశోక్ గ‌ల్లా, ర‌వి అంథోని, దినేష్ తేజ్‌, శ‌శిధ‌ర్ కోచ‌ర్ల‌కోట‌, విధి యాద‌వ్‌, అభిజ్ఞ ఉతులూరు, భ‌గ‌వాన్ తివారి, జతిన్ గోసామి, ర‌జ‌య్ రోవన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీహ‌ర్ష కొనుగంటి
నిర్మాణ సంస్థ‌లు: కేవ్‌మ్యాన్ స్టోరీస్‌, హెచ్‌కె ఫిల్మ్స్‌, క‌లియుగ వార‌ధ క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు: రాహుల్ వ‌ర్మ‌, కె.వీణా రాణి, కె.హ‌నుమంత్ రాజు
స‌హ నిర్మాత‌: కోమ‌టిరెడ్డి శ‌ర‌ణ్ రెడ్డి
సినిమాటోగ్ర‌ఫీ: జి.శ్రీనివాస్ రెడ్డి
మ్యూజిక్‌: స‌న్ని ఎం.ఆర్‌
అడిష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌: రామ్ మిర్యాల‌
ఎడిట‌ర్‌: విజ‌య్ వ‌ర్ధ‌న్ కావూరి
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: శ‌్రీకాంత్ రామిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: జ‌క్కుల వెంక‌టేష్ యాద‌వ్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: ఆజాద్ వ‌ర్మ‌
అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌: దేవ‌న‌ప‌ల్లి తిరుప‌తి
పి.ఆర్‌.ఒ: నాయుడు-ఫ‌ణి(బియాండ్ మీడియా)

Related Articles

Latest Articles