ఇటీవల రాజశేఖర్, జీవిత మరియు వారి కుమార్తెలు శివానీ, శివత్మికలకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజశేఖర్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక శివానీ మరియు శివత్మిక ఇద్దరూ కోలుకొని పూర్తిగా వైరస్ నుండి బయటపడ్డారు. అయితే రాజశేఖర్ ఇంకా కొలుకోలేదని తెలుస్తోంది. ఇక జీవిత మెల్లగా వైరస్ నుంచి బయటపడడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఇక తండ్రి రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై కూతురు శివాత్మిక సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. ప్రియమైన అందరికి. కోవిడ్‌తో నాన్నా పోరాటం చాలా కష్టం, అయినప్పటికీ అతను గట్టిగా పోరాడుతున్నాడు. మీ ప్రార్థనల ప్రేమ మరియు శుభాకాంక్షలు మమ్మల్ని రక్షించాయని అనుకుంటున్నాం. అలాగే మమ్మల్ని కొనసాగించాలని అనుకుంటున్నాను. నాన్నా త్వరగా కోలుకోవాలని ప్రార్థించమని నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను. మీ ప్రేమతో, అతను బలంగా బయటకు వస్తాడనే నమ్మకం ఉంది.. అంటూ శివాత్మిక వివరణ ఇచ్చింది.