రాధేశ్యామ్ లో కొత్త ట్విస్ట్.. ఒక్కడు కాదు, ఇద్దరు?

రెబల్ స్టార్ ఆభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ శుక్రవారం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ ట్విస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఎందుకంటే రీసెంట్ గా సినిమాకు సంబంధించిన ఒకక్ పోస్టర్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్ రాధేశ్యామ్ లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది.

అయితే సినిమాలో హీరోయిన్ పూజా, రాధ పాత్రలో నటిస్తోందని, ప్రభాస్ శ్యామ్ పాత్రలో నటిస్తాడాని అంతా భావించారు. కానీ రీసెంట్ గా విడుదల చేసిన పోస్టర్ ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నట్లు చెప్పారు. అంటే టైటిల్ ని బాత్యి చూస్తే సినిమాలో మరో పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ రోల్ లో ప్రభాస్ అలరించబోతున్నట్లు క్లియర్ గా అర్ధమవుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే.