నటి కంగనా రనౌత్ ఒడిశాకు చెందిన న్యాయవాది నుండి అత్యాచారం బెదిరింపులను అందుకుంది. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. నవరాత్రిలో ఆమె చేసిన ఫేస్ బుక్ పోస్ట్ పై ఈ కామెంట్స్ వచ్చాయి. అందులో ఆమెపై ముంబైలో నమోదైన మరో ఎఫ్ఐఆర్ గురించి కూడా ప్రస్తావించారు.
ముందుగా కంగనా ఇలా పోస్ట్ చేసింది. నవరాత్రిలో ఎవరు ఉపవాసం ఉన్నారు? నేటి వేడుకల నుండి పిక్చర్స్ క్లిక్ చేశాను, అదే సమయంలో నాపై మరొక ఎఫ్ఐఆర్ దాఖలు చేయబడింది, మహారాష్ట్రలోని పప్పు సేన నాపై మక్కువతో ఉన్నట్లు అనిపిస్తుంది, నన్ను మిస్ చేయవద్దు, నేను త్వరలోనే అక్కడకు వస్తాను.. అంటూ పోస్ట్ లో తెలియజేసింది. అయితే ఆ పోస్ట్ పై ఒక న్యాయవాదికి చెందిన ఎకౌంట్ నుంచి అత్యాచారం చేస్తామని బెదిరింపులకు పాల్పడగా.. న్యాయవాది తరువాత తన ఖాతా హ్యాక్ చేయబడిందని ఒక గమనికను పోస్ట్ చేశాడు. ఆయన ఇలా వ్రాశారు: “ఈ రోజు నా ఫేస్బుక్ ఐడి సాయంత్రం హ్యాక్ అయింది మరియు కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేయబడ్డాయి. ఇది ఏ స్త్రీలకు లేదా ఏ సమాజానికి సంబంధించిన నా అభిప్రాయాలు కాదు. నేను కూడా చాలా షాక్ అయ్యాను మరియు దానికి క్షమాపణలు కోరుతున్నాను.. అంటూ వివరణ ఇచ్చారు.