మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వస్త్ర బ్రాండ్ HIDI ప్రారంభించిన నటి అనన్య నాగళ్ల

తెలుగు నటి అనన్య నాగళ్ల మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ వెళ్ళే ప్రయాణంలో మరొక మెట్టు ఎక్కారు. మహిళలను ప్రోత్సహిస్తూ ఆమె ప్రారంభించిన HIDI బ్రాండ్ లో పూర్తిగా మహిళా ఉద్యోగులే ఉండేలా చేశారు. నటి అనన్య నాగళ్ల ఇప్పటికే అనేక సినిమాలలో హీరోయిన్ గా నటిస్తూ తనదైన ముద్రను వేసుకున్నారు. సమాజ బాధ్యతగా ఆమె తన వంతు ప్రయత్నంగా ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రిలకు రెండున్నర లక్షల రూపాయలు రాష్ట్రంలో వరదలు వచ్చిన విపత్తు సమయంలో ఆర్థిక సాయం చేసిన తొలి మహిళా నటిగా ముందుకు వచ్చారు. అలాగే వృద్ధులకు, మహిళలకు, చిన్న పిల్లలకు తనదైన శైలిలో సమాజ సేవ చేస్తూ ముందుకు వచ్చారు. అదేవిధంగా ఆమె తన అమ్మగారి పేరిట ఎన్నో సమాజసేవలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మహిళలను ప్రోత్సహిస్తూ మరోసారి ఆమె ముందుకు వచ్చారు. HIDI అనే బ్రాండ్ ద్వారా ఒక వస్త్ర బ్రాండ్ సృష్టించి దానిలో పూర్తిగా మహిళలే ఉద్యోగులుగా ఉంటారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ముఖ్యంగా ఈ HIDI బ్రాండ్ ద్వారా ఒమన్ ఎంపవర్మెంట్ మరింత ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. ప్రతిరోజూ భారత దేశపు వస్త్రాలను ప్రోత్సహిస్తూ ‘Everyday Indian Wear’ ఉండేలా అలాగే ఫాన్సీ వస్త్రాలు కూడా దీనిలో ఉండేలా ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే రోజువారి వేసుకునే కుర్తి వంటి దుస్తులు కూడా చాలా సౌకర్యమైన వస్త్రాలు HIDI లో ఉంటాయని తెలిపారు. చాలా సామాన్య మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన అనన్య నాగళ్ల మెట్టు మెట్టు తన కష్టంతో తాను పైకి ఎక్కుతూ అభివృద్ధి చెందిన మన అనన్య భవిష్యత్తులో HIDIకి సంబంధించిన ఫ్రాంచైజ్ కూడా మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు.

Related Articles

Latest Articles