
ఒకవైపు వందల కోట్ల విలువైన ఆస్తి, మరోవైపు తండ్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా ఏర్పడిన సెంటిమెంట్. కానీ, నగర ప్రజల కోసం, ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం ఏమాత్రం ఆలోచించకుండా తన ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు నటసింహం నందమూరి బాలకృష్ణ.
మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 అంటేనే ఒక వీఐపి అడ్రస్. అయితే, అక్కడ ఉన్న బాలకృష్ణ గారి ఇల్లు కేవలం ఒక భవనం కాదు, తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో, అంటే 1982లో సాక్షాత్తు నందమూరి తారక రామారావు గారు స్వయంగా నిర్మించి బాలకృష్ణ గారికి ఇచ్చిన చారిత్రాత్మక నివాసం ఇది.
దశాబ్దాలుగా నందమూరి కుటుంబ వేడుకలకు, రాజకీయ చర్చలకు, వేలాది మంది అభిమానులు తమ దైవాన్ని కలుసుకునే అడ్డాగా ఈ ఇల్లే ప్రధాన కేంద్రంగా నిలిచింది. అలాంటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్న ఇల్లు ఇప్పుడు వార్తల్లో నిలవడానికి అసలు కారణం ఏంటో తెలుసా?
హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్ చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ఈ పనులకు జూబ్లీహిల్స్ రోడ్డు విస్తరణలో భాగంగా బాలకృష్ణ గారి నివాస స్థలం కూడా అవసరమై అధికారులు అడిగినవెంటనే.
ఎవరూ ఊహించని విధంగా, బాలకృష్ణ గారు ఏకంగా 862.77 చదరపు గజాల విలువైన స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు! అంతేకాదు, దీనికి క్యాష్ రూపంలో కోట్లాది రూపాయల నగదు పరిహారం తీసుకోకుండా, కేవలం టీడీఆర్ (TDR) సర్టిఫికెట్లను మాత్రమే తీసుకుని తన గొప్ప మనసును చాటుకున్నారు. ఒక సెలబ్రిటీగా, ప్రజాప్రతినిధిగా ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
రోడ్డు విస్తరణలో భాగంగా పాత ఇంటి కొంత భాగం పోవడంతో, బాలకృష్ణ గారు ఇప్పుడు కొత్త అడ్రస్‌కి మారుతున్నారు. సరిగ్గా అదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం ఉంటున్న వీఐపి జోన్‌కి దగ్గర్లోనే ఓ భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు.
దాదాపు 9,300 నుంచి 10,000 చదరపు అడుగుల విశాలమైన స్థలంలో, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తులు (G+2) వచ్చేలా అత్యంత ఆధునిక హంగులతో ఈ కొత్త ప్యాలెస్ రూపుదిద్దుకుంటోంది. లగ్జరీ ఇంటీరియర్స్, ప్రైవేట్ స్పేస్ మరియు అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో ఈ నూతన గృహం త్వరలోనే ప్రారంభం కానుంది.
సెంటిమెంట్లు ఎంత ముఖ్యమైనప్పటికీ, నగర అభివృద్ధే ముఖ్యం అని భావించి తన ఇంటి స్థలాన్ని త్యాగం చేసిన నందమూరి బాలకృష్ణ గారి రియల్ లైఫ్ హీరో ఆటిట్యూడ్ గురించి మీరేమ అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో తెలపండి.


