
నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “క్రేజీ కల్యాణం”. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 16న “క్రేజీ కల్యాణం” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు ప్రొడ్యూసర్ బూసం జగన్ మోహన్ రెడ్డి.
- మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో “క్రేజీ కల్యాణం” సినిమాను నిర్మించాం. మా సినిమాను ఈ నెల 30న రిలీజ్ చేయాలని అనుకున్నాం. అయితే వెంకటేష్ గారి ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ కావడంతో మా టీమ్ అందరూ పండుగకు రిలీజ్ చేయండి అని సూచించారు. మా సినిమా కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కాబట్టి పండుగకు బాగుంటుంది రిలీజ్ చేస్తే అని భావించి ఈ నెల 16నే రిలీజ్ కు తీసుకొస్తున్నాం.
- మా మూవీ కంటెంట్ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ స్క్రిప్ట్ ఎవరు విన్నా ఇష్టపడ్డారు. అనుపమ, నరేష్ గారు, తరుణ్ భాస్కర్, అఖిల్ ..ఇలా అందరూ కథ చాలా బాగుందని చెప్పారు. మాకు స్క్రిప్ట్ మీద ఉన్న నమ్మకం, వాళ్లు ఇచ్చిన రెస్పాన్స్ తో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. ఈ నెల 16న రిలీజ్ కాబట్టి అనుపమ, నరేష్ గారు, తరుణ్ భాస్కర్..ఇలా ప్రతి ఆర్టిస్ట్ బ్యాలెన్స్ షూట్ కోసం సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లందరికీ సినిమా మీద గట్టి నమ్మకం ఉంది. మిగిలిన వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ కు తీసుకొస్తాం.
- నేను యాడ్ బిజినెస్ లో ఉన్నాను. ప్రభుత్వ యాడ్స్, డాక్యుమెంటరీస్, ఇతర కంపెనీల యాడ్స్ చేస్తుంటాను. డైరెక్టర్ బద్రప్ప నాతో చాలా ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. నాకు సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టం, ఆయనకు కూడా ప్యాషన్. కథల గురించి మా మధ్య డిస్కషన్స్ జరుగుతుండేవి. ఆ క్రమంలో ఈ కథ బద్రప్ప చెప్పగానే చాలా బాగుంటుందని మూవీగా నిర్మించాం. యాడ్ ఫిలిం మేకింగ్ లో నా అనుభవం నిర్మాతగా వ్యవహరించేందుకు బాగా ఉపయోగపడింది. నిర్మాతగా ఇది నా రెండో మూవీ. ఇది ఫ్యూర్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్రమిది. అయితే యూనివర్సల్ ఎమోషన్స్ ఉన్న సబ్జెక్ట్ ఇది. అయితే ఏపీ ప్రేక్షకులకు అర్థం కానంత టిపికల్ తెలంగాణ యాస మా మూవీలో ఉండదు. తెలుగు ప్రేక్షకులు అందరికీ సులువుగా అర్థమవుతుంది. అందరికీ నచ్చుతుంది.
- దర్శకుడిగా బద్రప్ప గాజులకు ఇది మొదటి సినిమా కావొచ్చు కానీ ఆయన యాడ్ ఫిలింస్ కు వర్క్ చేశాడు. ఆయన ప్రతిభ గురించి నాకు తెలుసు. పైగా కథ చాలా బాగుంది కాబట్టి ఏమాత్రం సందేహం లేకుండా మూవీ ప్రొడ్యూస్ చేశాను. మూడేళ్లు ఈ మూవీ కోసం వర్క్ చేశాం. ప్రాణం పెట్టి పనిచేశాం. మా సినిమాకు శాటిలైట్, ఓటీటీ, మ్యూజిక్..రైట్స్ అమ్మకం జరిగిపోయింది. అనుకున్న బడ్జెట్ లోనే సినిమాను కంప్లీట్ చేశాం. మా ఆర్టిస్టులంతా ప్రమోషన్స్ కు బాగా సపోర్ట్ చేస్తున్నారు.
- దసరా పండుగ తెలంగాణలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగకు ఎన్ని సినిమాలు వచ్చినా ప్రేక్షకులు చూస్తారు. మొదట్లో మాకు తక్కువ థియేటర్స్ లభించినా, మౌత్ టాక్ తో , పాజిటివ్ టాక్ తో ఎక్కువ స్క్రీన్స్ పెరుగుతాయనే నమ్మకం ఉంది. కంటెంట్ మీద, సక్సెస్ మీద పూర్తి కాన్ఫిడెంట్ తో ఉన్నాం. ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో జరిగే కథ ఇది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా చూశాక థియేటర్ నుంచి ఒక గుడ్ ఫీల్ తో బయటకు వస్తారు. బొమ్మరిల్లు వంటి సినిమాలు చూసినప్పుడు ఎలాంటి అనుభూతికి లోనవుతామో మా సినిమా చూశాక అలాంటి అనుభూతి కలుగుతుంది.
- మా మూవీలో అనుపమ తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు. ఆమె తెలంగాణ యాస నేర్చుకున్నారు. వర్క్ షాప్స్ లో పాల్గొన్నారు. నరేష్ గారు కూడా యాస నేర్చుకుని బాగా నటించారు. ఈ కథ విన్న వెంటనే అనుపమ తప్ప మరో నాయికను అనుకోలేదు. నరేష్ గారి క్యారెక్టర్ కూడా ఆయన తప్ప మరొకరు చేయరు అనిపించింది. సినిమా చూశాక మీకు కూడా ఇదే ఫీల్ కలుగుతుంది. చాలా సీన్స్ లో తరుణ్ భాస్కర్ తన తరహా ఇంప్రూవ్ మెంట్స్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆయన నటుడిగా చాలా బిజీ అవుతారు.
- సాంగ్స్ మా మూవీకి మంచి ఆకర్షణగా నిలుస్తాయి. సురేష్ బొబ్బిలి బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే డాక్టర్ గోరటి వెంకన్న మూడు పాటలు, కాసర్ల శ్యామ్ రెండు పాటలు, మిట్టపల్లి సురేందర్ ఒక పాట రాశారు. మొత్తం ఐదు సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి. మా సినిమాను మొత్తం మెదక్ చుట్టుపక్కల గ్రామాల్లో, మెదక్ టౌన్ లో రూపొందించాం. వంద శాతం రియల్ లొకేషన్స్ లో సినిమా షూట్ చేశాం.
- మా సినిమాను బన్నీ వాస్ గారు, సురేష్ ప్రొడక్షన్స్ వారు చూశారు. వాళ్లకు విపరీతంగా నచ్చింది. వాళ్లకు మా మూవీ బాగా నచ్చింది కాబట్టే బన్నీ వాస్ గారు, సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ సినిమాస్ కలిసి మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు రెండు వందల థియేటర్స్ లో మా మూవీ రిలీజ్ అవుతోంది. టాక్ ను బట్టి పెంచుకుందాం అని చెప్పారు. ప్రేక్షకులు ఇచ్చే ఆదరణతో తమిళం, మలయాళ ప్రేక్షకులకు కూడా మా మూవీని చేరువచేయాలని ఉంది.


