
హై జాయ్ కమర్షియల్స్ బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – వింటేజ్ ఐకానిక్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన చిత్రం “చకోర – Lunar Love Bird”. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా నేడు విడుదలైంది. అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రానికి రుప్ప గోపీకృష్ణ సినిమాటోగ్రఫీ చేయగా ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందించారు. ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ :
ఇద్దరు స్నేహితులు వారి వైవాహిక జీవితాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వారి మధ్యకు ఒక ప్రేమకథ వస్తుంది. తాతకు ఎంతో ఇష్టమైన తన మనవడి కోసం తన ఆస్తిని అంత ఇచ్చి ఆనందంగా కోరినవి అన్ని పొందేలా జీవించాలి అనుకుంటాడు. ఆ బాలుడికి చిన్నప్పటి నుండి తన తల్లి జాబిల్లిని చూపించి పెంచగా ఆ యువకునికి జాబిల్లిని చేరుకునే చకోర పక్షి లాంటి స్వభావం మొదలవుతుంది. అలా అతని జీవితంలోకి ఒక అమ్మాయి రావడంతో ఆ అమ్మాయిని తన జాబిల్లిలా బావించి ప్రేమిస్తాడు. అయితే ఆ అమ్మాయి అతడిని ఇష్టపడుతుందా లేదా? ఆ యువకుడిని ఆ ఆమె ఎలా ట్రీట్ చేస్తుంది? చివరికి చకోర పక్షిలా జాబిల్లి కోసం వెతికి చివరికి ఆగిపోతాడా లేదా ఆ అమ్మాయిని పొందుతాడా? అసలు ఆమె ఆ యువకుడిని విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? వంటి అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన :
ఈ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా మంచి జోడిలా అనిపించారు. ఈఈ సినిమాతో హీరోగా పరిచయమైన శ్రవణ్ కొత్త హీరోగా ఎక్కడ అనిపించలేదు. తన ప్రేమ కోసం అహర్నిశలు ప్రేయాసపడే ఒక యువకునిలా మంచి నటన స్ఫూర్తితో కనిపించదు. మలైకా టి. వాసుపల్ ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచమయ్యారు. అటు ఆట పట్టించే సరదా పాత్రలో అలాగే ఎమోషన్ క్యారీ చేయడంలో బ్యాలెన్స్ గా కనిపించారు. సుమన్, ఎల్ బి శ్రీరామ్ ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్రహ్మాజీ, ఇంద్రజ సినిమా అంతటా కనిపిస్తూ వారి పాత్రలకు న్యాయం చేశారు. నెల్లూరు సుదర్శన్ తనదైన శైలిలో నటిస్తూ నవ్వించారు. సినిమాలో నటించిన ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు బోనస్‌గా నిలిచారు.
సాంకేతిక విశ్లేషణ :
ఒక సింపుల్ కథను చాలా చక్కగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించారు. స్క్రీన్ ప్లే పర్వాలేదు. సినిమాలో కలరింగ్, లొకేషన్స్ చాలా బావున్నాయి. ఎడిటింగ్ అంతంత మాత్రమే. సినిమాలో పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బావున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సాంకేతిక విషయాలు
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు
సారాంశం :
ఒక చక్కటి యూత్‌ఫుల్ లవ్ స్టోరీ చకోర. స్వచ్ఛమైన ప్రేమ కోసం యువత ప్రయత్నాన్ని చూపిస్తూ కుటుంబ సమేతంగా చూసేలా వచ్చిన చిత్రం “చకోర – Lunar Love Bird”.


