“మయూఖ” చిత్ర రివ్యూ

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తూ ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మాతగా శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించిన చిత్రం “మయూఖ”. ఈ చిత్రానికి ఫర్హాన్ వడక్కం సినిమాటోగ్రఫీ చేయగా శిబి మాత్యూ అలెక్స్ సంగీతం అందించారు. శరత్ జె ఎడిటింగ్ చేసిన ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమన్ మసూద్, దేవ్ డి, మురళీధర్ గౌడ్, లావణ్య రాణి, చరిశ్మ దబ్బార, జాను వర్మ, నానాజీ కర్రి, రఘు వాసిరెడ్డి, అభిలాష్ అడ్డ, వి.ఎస్. రాజు, మది నస్రీన్, బేబి మాన్వీ, మాస్టర్ షణ్ముఖ చరణ్, శశి కదిరి, రాంబాబు రామిశెట్టి, పవన్ లక్కిరెడ్డి, మణిసాయి, సత్య విఠల్, ప్రశ్విత చౌదరి నల్లా, వేగి నాయుడు, శ్రీధర్, మణికంఠ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసుకునే యువతి ఒంటరిగా బ్యాంకు వారు ఇచ్చిన ఫ్లాట్ లో ఉంటుంది. అయితే నాతో పాటు ఆ ఫ్లాట్లో తనకి తెలియకుండా ఇంకెవరో ఉంటున్నట్లు తనకు అనిపిస్తూ ఉంటుంది. ఇదే విషయంపై పోలీసులకు కూడా పలుసార్లు కంప్లైంట్ చేయడంతో ఎటువంటి ఆధారాలు లేక వారు పెద్దగా పట్టించుకోరు. తనకి వాచ్మెన్ ఇంకా ఎదురెంటీ వ్యక్తిపై అనుమానం ఉన్నప్పటికీ తను అటువంటివి ఏమీ లేవు అని చెబుతూ వస్తుంది. ఇలా జరుగుతున్న క్రమంలో అదే నగరంలోని కొందరు యువతుల మృతదేహాలు ఘోరమైన పరిస్థితులలో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ హత్యలకు, ఈమెకు ఉన్న సంబంధం ఏంటి? నిజంగా తన ఫ్లాట్లో వేరే ఎవరైనా ఉంటున్నారా లేదా అది అంతా తన ఊహ? పోలీసులు ఆమె విషయంలో ఎంతవరకు సీరియస్ గా ఉన్నారు? చివరికి ఏమవుతుంది? అనే అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

నటీనటులు నటన :
ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన పాయల్ చెంగప్ప ఒక అమాయకపు పాత్రలో అలాగే భయపడుతూ ధైర్యం చేసిన వంటి వివిధ షేడ్స్ చూపిస్తూ నటించారు. ముఖ్యంగా కొన్ని భయానకమైన పరిస్థితులలో ఆమె భయపడుతూనే చాలా సెటిల్ గా నటించారు. తన స్నేహితురాలిగా నటించిన యువతి అటు కామెడీ చేస్తూ మరోవైపు తనకు సపోర్టు నిలిచే స్ట్రాంగ్ ఒమన్ గా కనిపిస్తూ ప్రేక్షకులను అలరించారు. పోలీస్ పాత్ర చేసిన వ్యక్తి సినిమాలో కొన్ని సీన్స్ లో మంచి హై ఇచ్చారు. మురళీధర్ గౌడ్ తన పాత్రకు న్యాయం చేస్తూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. చిత్రంలో నటించిన ఇతర నటీనటులు అందరూ తమ తమ పాత్రల పరిధిలో నటిస్తూ సినిమాకు మరింత బలాన్ని చేకూర్చారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక సైకలాజికల్ టెల్లర్ కథను ప్రేక్షకులు ఎంగేజ్ అయ్యే విధంగా వెండితెరపై తీసుకురావడం చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఇటువంటి సినిమాలు ఎన్నో వచ్చేసాయి కానీ ఈ సినిమా తనదైన గుర్తింపు తెచ్చుకుంది. స్క్రీన్ ప్లే స్లోగా ఉన్నప్పటికీ దర్శకత్వ విలువలతో ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేయడం జరిగింది. కొన్ని సీన్స్ లో ప్రేక్షకులు ఉలిక్కిపడేలా ఉన్నాయి. ముఖ్యంగా చీకటిలో తీయడంతో సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా అనిపించింది. ఈ సినిమాకు అక్కడక్కడ జర్క్ ఇస్తూ వచ్చిన సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇతర సాంకేతిక విషయాలు కూడా పరవాలేదు.

ప్లస్ పాయింట్స్ :
కథ, నటీనటుల నటన, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే, కొన్ని సన్నివేశాలు

సారాంశం :
థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి క్రైమ్ కథలు చూసేవారికి మయూఖ ఒక ఫుల్ మీల్స్ వంటిది.

Related Articles

Latest Articles