“కెమిస్ట్రీ”తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనున్న ధ్రువ సర్జా, నభా నటేష్

హీరోయిన్ నభా నటేష్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న కెమిస్ట్రీ సినిమాలో నభా హీరోయిన్ గా అలరించబోతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దర్శకుడు విశాల్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

కెరీర్ బిగినింగ్ లో రొమాంటిక్ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జానర్ లో కెమిస్ట్రీ సినిమా చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ లవ్ స్టోరీలో కెమిస్ట్రీ సినిమాతోనే నభా కనిపించడం విశేషం. ధ్రువ సర్జా, నభా నటేష్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ ఫ్రెష్ పెయిర్ ను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఈ ఏడాది నాగబంధం సినిమాలో తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది నభా నటేష్.

Related Articles

Latest Articles