ఘనంగా కిరణ్‌ అబ్బవరం ‘రికార్డ్‌’ చిత్రం ప్రారంభం

సక్సెస్‌ఫుల్‌ ప్రామిసింగ్‌ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న 14వ చిత్రానికి ‘రికార్డ్’ (RECORD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వీర కోగటం రచన, దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్‌తో పాటు నిర్మాతలు దిల్ రాజు, బన్నీ వాసు, ఏషియన్ సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, సుకుమార్ కెమెరా స్విచాన్ చేశారు. బన్నీ వాసు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు డీవీవీ దానయ్య, దిల్ రాజు చిత్ర యూనిట్‌కు స్క్రిప్ట్‌ను అందజేశారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కెమెరాకు సంబంధించిన సాంకేతిక పదాలతో రూపొందించిన ఈ పోస్టర్ సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచుతోంది. ఎర్రటి పౌర్ణమి చంద్రుడి నేపథ్యంలో కిరణ్ అబ్బవరం సిల్హౌట్‌ను చూపించారు. చంద్రుడి కింద నిలబడిన గాడిద, చీకట్లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ అమ్మాయి పోస్టర్‌కు మిస్టీరియస్ లుక్‌ను తీసుకొచ్చాయి. ఈ విభిన్నమైన అంశాలు సినిమా ఏ జానర్‌లో తెరకెక్కనుందనే ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఈ సందర్భంగా హీరో కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ” వెరీ హ్యపీ.. సుకుమార్‌ గారితో అసోసియేషన్‌… వంశీ నందిపాటి గారితో ‘క’ తరువాత మళ్లీ అసోసియేషన్‌ అవ్వడం.. అలాగే అశోక్‌ బండ్రెడ్డి గారు కూడా ఈసినిమాకు నిర్మాత కావడం.. మంచి సినిమా అందిస్తామనే నమ్మకం ఉంది. టైటిల్‌ రికార్డ్‌ తో పాటు సినిమా కూడా అందరికి నచ్చుతుంది. 18 సంవత్సరాలు మీడియాలో పనిచేసిన వీర ఈ సినిమాతో దర్శకుడు అవుతున్నాడు. ఈ కథతో పాటు ఆయన తపన బాగా నచ్చింది. ఈ కథను వీర ఎంతో అద్భుతంగా డెలీవరి చేస్తాడనే నమ్మకం ఉంది. ఈ సినిమా అందరూ గర్వపడే సినిమా అవుతుంది’ అన్నారు.

నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ ” కిరణ్‌ అబ్బవరం గారితో చేస్తున్న ఈ ‘రికార్డ్‌’ సినిమా ఇండస్ట్రీలోని రికార్ట్‌లన్నీ బద్దలు కొట్టాలని కోరుకుంటున్నాను. ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. ఈ సినిమా తో అశోక్‌ బండ్రెడ్డి.. ది స్టోరీస్‌తో ఈ సినిమాకు నిర్మాతగా ఉండటం హ్యాపీగా ఉంది. సుకుమార్‌ రైటింగ్స్‌తో కూడా అసోసియేట్‌ అవ్వడం నా కల నెరవేరినట్లుగా అనిపిస్తుంది. ఇందుకు కారణమైన సుకుమార్‌ గారికి, కిరణ్‌ గారికి నా ధన్యవాదాలు’ అన్నారు.

నిర్మాత అశోక్‌ బండ్రెడ్డి మాట్లాడుతూ ” ఈ సినిమా కథను అంగీకరించిన కిరణ్‌ అబ్బవరంకు నా ధన్యవాదాలు. దర్శకుడు వీర ఓ మంచి కథతో కొత్త సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను’ అన్నారు.

దర్శకుడు వీర కోగటం మాట్లాడుతూ ” నా బ్లెస్‌ చేయడానికి వచ్చిన నా స్నేహితులకు కృతజ్క్షతలు.. ఈ సినిమా ఎంత మంచి కథతో వస్తున్నాం అని చెప్పగలను. కర్నూలు కొండారెడ్డి బూరుజు సాక్షిగా ఓ మంచి సినిమా ఇస్తున్నానని నమ్మకంగా చెబుతున్నాను’ అన్నారు.

ఈ చిత్రంతో వీర కోగటం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది.

విభిన్నమైన టైటిల్, ఆసక్తికరమైన పోస్టర్‌తో ‘రికార్డ్’ చిత్రంపై మేకర్స్ అంచనాలను పెంచారు. ఈ సినిమా కథాంశం, ఇతర నటీనటులకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

నటీనటులు: కిరణ్ అబ్బవరం

సాంకేతిక నిపుణులు:

  • కథ, దర్శకత్వం: వీర కోగటం
  • సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
  • సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
  • నిర్మాతలు: వంశీ నందిపాటి, అశోక్ బండ్రెడ్డి
  • నిర్మాణ సంస్థలు: వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, సుకుమార్ రైటింగ్స్, ది స్టోరీస్

Related Articles

Latest Articles