ఘనంగా ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌

ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించారు. ఈ సినిమాతో శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీని అక్టోబర్ 2న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

ఫహాద్ ఫాజిల్ మాట్లాడుతూ .. ‘‘తెలుగు నుంచి నాకు ఇంత ప్రేమ వస్తుందని, హైదరాబాద్‌లో ఇంత లవ్ దొరకుతుందని అనుకోలేదు. గత కొన్ని నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాను. హైదరాబాద్ బిర్యానీ తిని కాస్త లావెక్కాను (నవ్వుతూ). ట్రైలర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఫ్యామిలీతో కలిసి చూడండి. అందరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. కార్తికేయ, శోభు గారు గొప్ప నిర్మాతలు. సారా వల్ల ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకంగా మారింది. ఈ చిత్రం నాకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. ఈ సినిమా ఆడియెన్స్‌కి కచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మాకు ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన బాలయ్య గారికి, కమల్ గారికి, మోహన్ లాల్ గారికి థాంక్స్.’ అని అన్నారు.

ఎస్ఎస్ కార్తికేయ మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చాలా కొత్తగా ఉంటుంది. శశాంక్ కథను, స్క్రీన్ ప్లేని చాలా కొత్తగా రాసుకున్నాడు. టీజర్‌తో కొంత కథను రివీల్ చేశారు. ట్రైలర్‌తో మరి కొంత కథను చెప్పే ప్రయత్నం చేశాను. ఫహద్‌ని తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తుండటం ఆనందంగా ఉంది. సారా అద్బుతంగా నటించింది. ఈ పాపతో చాలా సర్ ప్రైజ్‌లు ఉంటాయి. శోభు గారితో ప్రయాణం ఎప్పుడూ గొప్పగానే ఉంటుంది. సినిమాని చూసి అందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

శోభు యార్లగడ్డ మాట్లాడుతూ .. ‘ఫహాద్‌ని తెలుగులో లీడ్‌గా ఇంట్రడ్యూస్ చేస్తుండటం ఆనందంగా ఉంది. శశాంక్‌ని ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. సారాని చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారు. కార్తికేయతో పది, పదిహేనేళ్ల జర్నీ ఉంది. ఈ సినిమాకి మేం కలిసి పని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

దర్శకుడు శశాంక్ యేలేటి మాట్లాడుతూ .. ‘‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’కి వాయిస్ ఓవర్ ఇచ్చిన బాలయ్య గారికి థాంక్స్. ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను. మున్ముందు మరిన్ని విషయాల్ని పంచుకుంటాను’ అని అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ సారా మాట్లాడుతూ .. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. మా ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దివ్య, సూరి ప్రపంచాన్ని ఈ ట్రైలర్‌తో కాస్త పరిచయం చేశాం. నాకు నటనలో ఎన్నో విషయాల్ని నేర్పించిన శశాంక్ గారికి థాంక్స్. దివ్య పాత్రను నాకు ఇచ్చిన కార్తికేయ గారికి, శోభు గారికి థాంక్స్. ఫహాద్ గారితో పని చేయడం నా అదృష్టం. సెట్‌లో నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. అక్టోబర్ 2న మా చిత్రం రాబోతోంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో వచ్చి అందరూ కలిసి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.

నటీనటులు : ఫహాద్ ఫాజిల్, సారా తదితరులు

దర్శకుడు: శశాంక్ యేలేటి
నిర్మాతలు : శోబు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ
స్క్రిప్ట్ డెవలప్మెంట్: S.S కంచి
సహ రచయిత: హంజా అలీ
ప్రొడక్షన్ డిజైన్: మోహన్ నాథ్ బింగి – సందీప్ సువర్ణ
సంగీత దర్శకుడు: కాల భైరవ
DOP: బ్రాడ్ ఫ్రాన్సిస్ ACS
స్టైలిస్ట్: రమా రాజమౌళి
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: S S శశాంక్
లైన్ ప్రొడ్యూసర్: రాహుల్ షాలి
ప్రొడక్షన్ కంట్రోలర్: డి యోగానంద్
సౌండ్ డిజైన్: మనోజ్ గోస్వామి
పీఆర్వో : వంశీ కాకా

Related Articles

Latest Articles