బాయ్ ఫ్రెండ్ కోసం నయనతార ఎంత ఖర్చు చేసిందో తెలుసా?

సౌత్ ఇండియాలో అగ్ర నటిమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న నయనతార ఇండస్ట్రీలో పోటీ పెరుగుతున్న కొద్దీ తన క్రేజ్ ని కూడా గట్టిగానే పెంచుకుంటోంది. పర్సనల్ లైఫ్ విషయాలు కెరీర్ పై ప్రభావం చూపకుండా ఈ బ్యూటీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నయన్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల అతని 35వ పుట్టినరోజుకి గోవాకు వెళ్లిన నయన్ అక్కడ ఖర్చు మొత్తం తనే భరించిందట.

దాదాపు 25లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతంలో చాలా సార్లు వీరు విదేశాలకు వెళ్లారు. అప్పుడు కూడా నయన్ తన సొంత ఖర్చులతోనే ట్రిప్స్ ప్లాన్ చేసుకుంది. ఇక కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న సమయంలో కూడా అమ్మడు ప్రేమ యాత్రలను మరువలేదు. ఇక నెక్స్ట్ విగ్నేష్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పెళ్లి రూమర్స్ వైరల్ అవుతున్న తరుణంలో ఇటీవల అవన్నీ అబద్ధమని తమకు నచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటామని విగ్నేష్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే.