క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ తీసుకున్నారు.. షేర్లిన్ చోప్రా

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒకరి తరువాత మరొకరిని విచారణ జరుపుతున్న వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే ఇటీవల ఒక హాట్ బ్యూటీ ఏకంగా ఐపీఎల్ లో క్రికెటర్ల భార్యలు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు కామేంట్స్ చేయడం వైరల్ గా మారింది. ఆ బ్యూటీ మరెవరో కాదు తెలుగులో ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలో కనిపించిన షేర్లిన్ చోప్రా.

కామసూత్ర 3Dతో పాటు పలు హీంది సినిమాల్లో కూడా నటించింది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రికెటర్స్ బార్యలపై సంచలన ఆరోపణలు చేసింది. గతంలో ఒకసారి ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాను. ఇక మ్యాచ్ అనంతరం గెలుపు సంబరాల్లో కోల్ కత్తా టీమ్ తో చిందులు వేయడానికి వెళ్లగా అక్కడ నాకొక దృశ్యం కనిపించింది. బాత్రూమ్ లలో క్రికెటర్ల భార్యలు కొకైన్ తీసుకుంటూ కనిపించారు. పురుషుల వాష్ రూమ్ లలో కూడా అదే సీన్ కనిపించిందని షేర్లిన్ ఆరోపించడం హాట్ టాపిక్ గా మారింది.