“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ… “అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో ఒక అద్భుతమైన పాట పాడటం జరిగింది. ప్రేక్షకులు పాటను బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు ఈ పాట పాడే అవకాశం ఇచ్చిన చిత్ర బృందానికి థాంక్స్” అన్నారు.

నిర్మాత చందు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ… “మహారత్న ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానున్న తొలిచిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతి అందించాలనే ఉద్దేశంతో ప్రేమనే ఊరిలో సినిమాను సురేష్ కొండేటి గారితో కలిసి ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాము. ఈ చిత్రానికి రాంబాబు గోశాల గారు పాటలు రచించారు. గొప్ప గాయనీ గాయకులు ఈ సినిమాలోని పాటలకు తమ స్వరం అందించడం జరిగింది. ప్రేక్షకులు అంత కుటుంబ సమేతంగా వచ్చి ప్రేమనే ఊరిలో సినిమాను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

Related Articles

Latest Articles